Abn logo
Aug 7 2020 @ 03:48AM

సచివాలయం దారిలో పారిశుధ్య పోరు!

అమరావతి, ఆంధ్రజ్యోతి: మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదంటూ సచివాలయం, అసెంబ్లీల్లో విధులు నిర్వర్తించే సుమారు 160 మంది పారిశుధ్య కార్మికులు గురువారం విధులు బహిష్కరించారు. మల్కాపురం నుంచి సచివాలయం మీదుగా ఐనవోలు వెళ్లే రోడ్డుపై  రెండో గేటు ఎదురుగా సచివాలయానికి సమీపంలో ఇలా తమ నిరసన తెలిపారు. కాంట్రాక్టు సంస్థ సుమిత్‌ జీఎం, తుళ్లూరు డీఎస్పీ వారితో చర్చించారు. మే, జూన్‌ వేతనాలు శుక్రవారం సాయంత్రానికి కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని, జూలై వేతనాలు 12వ తేదీకి వేస్తామని హామీఇవ్వడంతో వారు శాంతించారు.     


Advertisement
Advertisement
Advertisement