Abn logo
Oct 21 2021 @ 22:43PM

పారిశుధ్య కార్మికుడిపై వలంటీర్‌ దాడి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమణయ్య

 ఇందుకూరుపేట, అక్టోబరు 21 : మండలంలోని ముదివర్తిపాళేనికి చెందిన పారిశుధ్య కార్మికుడు   (గ్రీన్‌ అంబాసిడర్‌) మానికల రమణయ్యపై గురువారం అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ బద్దెపూడి ప్రసాద్‌ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడు ఇందుకూరుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్వే పేరుతో ఆదివారం వలంటీరు ఇంటి వద్ద ఆడపిల్లలతో  మాట్లాడుతుండగా రమణయ్య మందలించాడు. దీనిని మనసులో పెట్టుకుని ప్రసాద్‌ గురువారం దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 


విధుల నుంచి వలంటీర్‌ తొలగింపు 

ముదివర్తిపాళెం వలంటీర్‌ బద్దెపూడి ప్రసాద్‌ని విఽధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీవో రఫీఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుధ్య కార్మికుడు మాణికల రమణయ్యపై వలంటీర్‌ దాడిచేసి గాయపర్చాడు. దీంతో విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మండలంలోని వలంటీర్లు ప్రజల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని ఎంపీడీవో కోరారు.