Abn logo
Sep 26 2021 @ 17:49PM

ఇక్కడ స్కూలుకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!

సంగారెడ్డి: జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరిదాపూర్ మండలంలోని తండాల ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. వాగుల్లో వరద ప్రవహిస్తుండటంతో స్కూలు పిల్లలు, గ్రామస్తులు పక్క ఊరికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు కష్టాలు పడాల్సిందే. ప్రతి ఏడాది వానాకాలంలో దాదాపు మూడు నెలల పాటు ఇలా నడుము లోతు వరదలో నడవాల్సి వస్తోందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలుకు వెళ్లుందుకు విద్యార్థులు ఆపసోపాలు పడుతున్నారు. వరదల ఉధృతికి గతంలో పలువురు కొట్టుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. వాగులపై హై లెవల్ బ్రిడ్జి కట్టాలని తండా వాసులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లాలన్నా కష్టంగా ఉందని వాపోతున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...