Advertisement
Advertisement
Abn logo
Advertisement

కెప్టెన్‌గా సందీప్‌రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అమెరికన్‌ ఫుట్‌బాల్‌ భారత జట్టు కెప్టెన్‌గా కడపకు చెందిన పోతిరెడ్డి సందీప్‌ రెడ్డి నియమితుడయ్యాడు. ఈనెల 6 నుంచి ఇజ్రాయిల్‌లో జరగనున్న వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత జట్టుకు సందీప్‌ నాయకత్వం వహించనున్నాడు. సందీ్‌ప సహా ఏడుగురు తెలుగు ప్లేయర్లు సంతోష్‌, కేతన్‌, రోహిత్‌ (తెలంగాణ), అవినాష్‌, శివప్రసాద్‌, మణికంఠ (ఆంధ్రప్రదేశ్‌) భారత జట్టుకు ఎంపికయ్యారు. 24 దేశాలు పోటీపడే ఈ టోర్నీలో భారత్‌ పూల్‌-ఎలో అమెరికా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, చిలీ, కెనడాతో కలిసి ఆడనుంది. 

Advertisement
Advertisement