Abn logo
Oct 15 2021 @ 01:28AM

ఇసుక అక్రమ రవాణా

చిట్యాల బ్రిడ్జి వద్ద వాగులో యథేచ్ఛగా ఇసుక తోలకాలు చేస్తున్న ట్రాక్టర్లు

చిట్యాల(తిరువూరు), అక్టోబరు 14: మండలంలోని చిట్యాల కట్టలేరు బ్రిడ్జి సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండానే గురువారం యథేచ్ఛగా ఇసుక తోలకాలు నిర్వహించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సరిపడా ఇసుక తోలుకునేందుకు పంచాయతీరాజ్‌ ఏఈ సిఫార్సుతో మండల పరిషత్‌ అధికారులు అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం అటువంటి అనుమతులు ఇటీవల నిలుపుదల చేశారు. ఉదయం నుంచి బ్రిడ్జి సమీపంలోని వాగులో పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి యథేచ్ఛగా ఇసుక తోలకాలు జరుపుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తిచూడకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అధికారులు అందుబాటులో లేరు.