Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంట్రీలెవల్ యూజర్ల కోసం.. సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేసిన శాంసంగ్

న్యూఢిల్లీ: దక్షిణి కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మరో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అయిన దీని పేరు ‘శాసంగ్ గెలాక్సీ ఎ03 కోర్’. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్‌ప్లే, యూనిసోక్ ఎస్‌సీ9863ఎ ఎస్‌ఓసీ, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.


వెనకవైపు 8 ఎంపీ, ముందువైపు 5 ఎంపీకెమెరా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. శాంసంగ్ ఎ03 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 7,999 మాత్రమే. బ్లాక్, బ్లూకలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 

Advertisement
Advertisement