May 9 2021 @ 12:32PM

‘క్యాలీఫ్లవర్’గా సంపూర్ణేష్ బాబు

ఆదివారం(మే9) సంపూర్ణేష్‌బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న క్యాలీఫ్ల‌వ‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు బ్రిటీషర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. భార‌తీయ మ‌హిళ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి తెలియ‌చేయ‌డానికి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వ‌చ్చిన వ్య‌క్తి పాత్ర‌లో సంపు క‌నిపిస్తాడ‌ని మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆశా జ్యోతి గోగినేని నిర్మాత‌. వ‌సంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది.