బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా చేసిన 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాలు సంచలన విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్లో కామ్‌గా ఉన్న సంపూర్ణేష్ బాబు ఇటీవలే ఓ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. లాక్డౌన్ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ని ఫిక్స్ చేశారు. 'బజార్ రౌడీ' అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వసంత నాగేశ్వరావు తెరకెక్కిస్తున్నారు. కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబుకి జోడిగా మహి నటిస్తుంది.
ఇక పాటల్లో సంపూర్ణేష్ బాబు డాన్స్లకి, ఆయన వేసే స్టెప్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ ని ఇప్పుడు బజార్ రౌడీ టీం డబుల్ చేస్తున్నారు. "ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, పరుగు, మగధీర, ఆర్య-2, డార్లింగ్, సింహ, మర్యాదరామన్న, 100 పర్సంట్ లవ్, బృందావనం, కందిరీగ, పూలరంగడు, ఇష్క్, రచ్చ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాహుబలి -1, బాహుబలి-2, రంగస్థలం" వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌కే కాకుండా తమిళంలో "మార్షల్, వీరం, శగుని, వేలాయుదం" లాంటి సూపర్ హిట్ చిత్రాలకి సూపర్‌స్టార్స్‌కి కొరియోగ్రఫీ అందించిన ట్రెండ్‌సెట్టింగ్ కొరియోగ్రాఫర్ మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ ఈ బజార్ రౌడీతో స్టెప్స్ వేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ.. ''ఎంతో బిజీగా ఉండి ఎన్నో బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేసి, ఆ చిత్రాల గ్రాఫ్‌ని మార్చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మా చిత్రంలో మా బజార్ రౌడీతో స్టెప్స్ వేయించి మా చిత్రం గ్రాఫ్‌ని అమాంతం పెంచినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో 20 మంది డాన్స్ర్స్తో హీరో సంపూర్ణేష్ బాబు, మహిలపై చిత్రీకరిస్తున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తి చేశాము. త్వరలో క్లైమాక్స్ మరియు మరో రెండు సాంగ్స్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి బజార్ రౌడీ అనే టైటిల్ అనుకున్న వెంటనే మా యూనిట్ అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావటం మాలో కొత్త ఎనర్జీ వచ్చింది. మా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావుగారు బడ్జెట్ విషయంలో ఎక్కడా లిమిటేషన్ పెట్టకుండా చిత్రాన్ని నిర్మిస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్, తన అనుభవంతో ఎక్కడ ఖర్చుపెడితే స్ర్కీన్ మీద కనబడుతుందో చక్కటి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో షియాజి షిండే, థర్ఠి ఇయర్స్ పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ తదితర వివరాలు అతిత్వరలో తెలియజేస్తాం.." అన్నారు.