Abn logo
Sep 21 2021 @ 00:19AM

జాతీయ చెస్‌లో సంహితకు రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ అండ ర్‌-8 ఓపెన్‌, బాలికల ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ చిన్నారి పి. సంహిత రజతం సాధించింది. అఖిల భారత చెస్‌ సమాఖ్య నిర్వహించిన ఈ టోర్నీలో ఆసాంతం ఆకట్టుకొనే ప్రదర్శన కనబరచిన సంహిత మొత్తం 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. ఆమె ఆరు, ఎనిమిదో రౌండ్లలో మాత్రమే ఓటమిపాలైంది. ఈ ప్రదర్శనతో సంహిత.. వచ్చేనెల 21 నుంచి 24 వరకు జరిగే ఆసియా యూత్‌ అండ ర్‌-8 చెస్‌ చాంపియన్‌షి్‌ప బెర్త్‌ను కైవసం చేసుకొంది.