Abn logo
Sep 18 2020 @ 17:08PM

అఖిల్‌ అక్కినేని పెళ్లి ఫిక్సయిందా?

Kaakateeya

అఖిల్‌ అక్కినేని పెళ్లి విషయంలో కొన్ని సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. శ్రేయా భూపాల్‌తో నిశ్చితార్థం తర్వాత.. అనూహ్యంగా అఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయింది. ఆ తర్వాత శ్రేయా భూపాల్‌ పెళ్లి వేరొకరితో అయిపోయింది. కానీ అఖిల్‌ మాత్రం అలానే ఉండిపోయారు. వాస్తవానికి అన్నీ సక్రమంగా జరిగితే.. అన్న నాగచైతన్య కంటే ముందే అఖిల్‌ పెళ్లి అయిపోయేది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా నిశ్చితార్థం తర్వాత వారు విడిపోయారు. తాజాగా మరోసారి అఖిల్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అఖిల్‌ అక్కినేని పెళ్లి ఫిక్స్ అయిందని, ఈసారి అఖిల్‌ పెళ్లి బాధ్యతలను ఆయన వదిన సమంత తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఓ వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్‌ పెళ్లి ఫిక్సయిందని, ఈ పెళ్లి విషయంలో ఇరు కుటుంబాలను మెప్పించే బాధ్యత సమంత తీసుకుని, అందుకు సంబంధించిన పనులను చక్కబెడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఇరు ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకోవడం జరిగిందని, త్వరలోనే అఖిల్‌ పెళ్లికి సంబంధించిన వార్త అఫీషియల్‌గా రానుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అక్కినేని ఫ్యామిలీ స్పందించాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement