Abn logo
Mar 28 2020 @ 12:38PM

అనుష్క స్థానంలో స‌మంత‌..?

స‌మంత అక్కినేని ఇప్పుడు గ్లామ‌ర్ పాత్ర‌ల కంటే పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తుంది. ఈ మ‌ధ్య ఆమె చేసిన సినిమాల‌న్నీ న‌టిగా స‌మంత‌కు చాలా మంచి పేరునే తెచ్చి పెట్టాయి. తాజా స‌మాచారం మేర‌కు ఓ బ‌యోపిక్‌లో స‌మంత న‌టించే అవ‌కాశాలున్నాయంటున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. దేవ‌దాసీ నుండి సంగీత క‌ళాకారిణిగా ఎదిగిన బెంగుళూరు నాగ‌ర‌త్న‌మ్మ జీవితాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు. ముందు నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌లో అనుష్క పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు స‌మంత‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి సమంత అందుకు ఒప్పుకుంటుందో లేదో మ‌రి!.

Advertisement
Advertisement
Advertisement