Oct 19 2021 @ 16:06PM

Kangana Ranaut ఇన్‌ స్టా పోస్ట్‌పై Samantha రియాక్షన్!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం `ధాకడ్`. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగన గూఢచారిగా కనిపించనుంది. ఈ సినిమాలో కంగన విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనుంది. ఆ సినిమాలో తన గెటప్‌లకు సంబంధించిన ఫోటోలను కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. `ఆమె భయంకరమైనది, ధైర్యం కలిగినది.. వెండితెరపై సందడి చేయడానికి ఏజెంట్ అగ్నిగా రాబోతోంది. 8 ఏప్రిల్ 2022న `ధాకడ్` సినిమా విడుదల కాబోతోంద`ని కంగన కామెంట్ చేసింది. 

ఈ పోస్ట్‌పై టాలీవుడ్ హీరోయిన్ సమంత స్పందించింది. కామెంట్ సెక్షన్‌లో ఫైర్ ఎమోజీలను జత చేసింది. అలాగే ఆ పోస్ట్‌ను లైక్ చేసింది. కాగా, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంలో సమంతకు కంగన మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మాట విని సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చాడని, తప్పంతా చైతన్యదేనని విమర్శించింది. అలాగే సమంతను మహిళా సాధికారతకు ప్రతిరూపంగా అభివర్ణించింది. 

Bollywoodమరిన్ని...