Oct 27 2021 @ 14:38PM

మీ కూతుళ్ళని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్ధులుగా చేయండి : సమంత

అక్కినేని నాగచైతన్య , సమంత బ్రేకప్ రచ్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇద్దరూ విడిపోవడానికి గల కారణాల్ని కథనాలుగా.. సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు రాసిపడేస్తుండడంతో, అలాంటి వారికి లీగల్ గా బుద్ధిచెప్పి సక్సెస్ అయ్యారు సామ్. చైతూతో విడిపోయిన తర్వాత సమంతలో చాలా మార్పులొచ్చాయి. ఆ బాధ నుంచి తొందరగా కోలుకొని.. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకొనే రీతిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల తన స్నేహితురాలితో తీర్థయాత్రలు చేసి వచ్చిన ఆమె.. చాలా వరకూ సన్నిహితులతో సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సామ్.. తాజాగా ఇస్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 



కూతుళ్ళు కలిగిన తల్లిదండ్రులకు సమంతా హితబోధ చేశారు. ‘మీ కూతుళ్ళని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్ధులుగా తీర్చిదిద్దండి. వారికి తొందరగా పెళ్ళి చేసేయాలన్న  ఆలోచన విడనాడండి. వారిని పెళ్ళికోసం ప్రిపేర్ చేయడం కంటే..  వారిని వారిగా ఉండేలా చేయడం ముఖ్యం. పెళ్ళికోసం పోగేసిన డబ్బుల్ని వారి విద్యకోసం కేటాయించండి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా చేయండి’.. అంటూ సామ్ తల్లిదండ్రులకు సూచించారు. సమంతా పెట్టిన ఈ పోస్ట్ కు నెటిజెన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.  సమంత ప్రస్తుతం గుణ శేఖర్ ‘శాకుంతలం’, విఘ్నేష్ శివన్ ‘కాదువాకుల రెండు కాదల్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటున్నారు.