Abn logo
May 28 2020 @ 23:29PM

పూజా హెగ్డేపై సమంత ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పాల్సిందే

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన అకౌంట్ నుంచి వ్యక్తిగతంగా ఎవరికైనా మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మకండని హీరోయిన్ పూజా హెగ్డే ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం తన టెక్నికల్ టీమ్ గంటపాటు శ్రమించి తన ఇన్‌స్టా ఖాతాను పునరుద్ధరించారని తెలిపింది. అయితే ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తన ఖాతా నుంచి హీరోయిన్ సమంతపై అసభ్యకర పోస్ట్‌లు వచ్చేశాయి. గంట తర్వాత తన ఇన్‌స్టా ఖాతా తన చేతికి వచ్చిందని చెప్పిన పూజా హెగ్డే.. ఈ గంటలో పోస్ట్ అయిన ఫొటోలను తొలగించడం జరిగిందని కూడా పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ అవమానపడింది సమంత కాబట్టి.. వెంటనే పూజా హెగ్డే.. సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సమంత అభిమానులు సోషల్ మీడియాలో ట్యాగ్స్ చేస్తున్నారు. 


సమంత మాత్రం విక్టరీ సింబర్ చూపిస్తూ.. చిరునవ్వుతో ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డేపై ఫైర్ అవుతూనే ఉన్నారు. వెంటనే పూజా తమ అభిమాన హీరోయిన్‌కి క్షమాపణలు చెబితే సరి.. లేదంటే.. అంటూ కాస్త స్ట్రాంగ్‌గానే కామెంట్స్ పడుతున్నాయి. మరి దీనికి పూజా హెగ్డే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. 

Advertisement
Advertisement
Advertisement