Abn logo
Sep 22 2020 @ 14:25PM

సౌత్‌పై కన్నేసిన సల్మాన్‌.. రాధేపై స్పెషల్‌ ఫోకస్‌

Kaakateeya

బాలీవుడ్‌ స్టార్‌ హీరో, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'రాధే'. ఈ ఏడాది ఈద్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికీ కోవిడ్‌ ఎఫెక్ట్‌తో సినిమా వచ్చే ఏడాదికి వెళ్లింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. తన గత చిత్రం దబంగ్‌ 3ను ప్యాన్‌ ఇండియా మూవీగా సౌత్‌లో సల్మాన్‌ విడుదల చేస్తే.. నిరాశజనకమైన ఫలితమే వచ్చింది. అయితే సల్మాన్‌ తన ఆశలను వదులుకోవడం లేదు. 'రాధే' చిత్రాన్ని కూడా ప్యాన్‌ ఇండియా మూవీగానే విడుదల చేయాలని అనుకుంటున్నారట.



సినిమాకు ప్యాన్ ఇండియా లుక్‌ తేవాలని దక్షిణాది నటీనటులను తన చిత్రంలో తీసుకుంటున్నారట సల్మాన్‌. ఈ సినిమా డైరెక్టర్‌ ప్రభుదేవా ఎలాగూ దక్షిణాదికి చెందినవాడే. ఇక ఈ సినిమాలో తెలుగు నటుడు నర్రాశీను, తమిళం నుండి యాక్టర్‌ భరత్‌, హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌లను తీసుకున్నారట. రాధేతో ప్యాన్‌ ఇండియా హీరోగా గట్టి ప్రయత్నం చే్స్తున్న సల్మాన్‌ ఆశ నేరువేరుతుందా? అనేది తెలియాలంటే వెయిటింగ్‌ తప్పదు. 


Advertisement
Advertisement
Advertisement