Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో ఎన్నారైలు, భారత ప్రవాసులు ఆర్జించే వేతనాలపై పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ గురువారం వెల్లడించారు. ఫైనాన్స్ యాక్ట్ 2021లో గల్ఫ్‌లోని ఎన్నారైలకు పన్నుల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించారో స్పష్టంగా లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో ఎన్నారైలు ఆర్జించిన వేతనాలపై ఎలాంటి పన్ను విధించడం లేదని సమాధానం ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.  


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement