Aug 2 2021 @ 14:45PM

‘సలార్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రాధేశ్యామ్‌’ పూర్తయ్యిందో లేదో ‘సలార్’ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌భాస్ ఈ షెడ్యూల్‌లో పాల్గొన‌బోతున్నార‌ని స‌మాచారం. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో పాటు ఆదిపురుష్‌ను కూడా ప్ర‌భాస్ పూర్తి చేస్తాడు. మ‌రో వైపు ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.