Abn logo
Apr 1 2020 @ 20:44PM

ముఖ్య‌మంత్రితో సాయితేజ్ యుద్ధం

ముఖ్య‌మంత్రితో హీరో సాయితేజ్ యుద్ధం చేయ‌డ‌మేంటి? ఎందుక‌ని అనుకుంటున్నారా?  రియ‌ల్‌గా కాదు లెండి.. రీల్ లైఫ్‌లో. ప్ర‌స్తుతం సాయితేజ్ ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో సాయితేజ్ న‌టిస్తున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో సాయితేజ్ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. విద్యావ్య‌వ‌స్థ‌లోని త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ ముఖ్య‌మంత్రిని ఢీ కొట్టే పాత్ర‌లో సాయితేజ్ క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ క‌నిపిస్తార‌ని టాక్‌.

Advertisement
Advertisement
Advertisement