Abn logo
Oct 24 2020 @ 13:23PM

సాయిపల్లవి న్యూ టాలెంట్‌

Kaakateeya

హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సాయిపల్లవి తాజా చిత్రం కోసం ఉత్తరప్రదేశ్‌ పిప్రీలో ఉంది. షూటింగ్‌ సమయంలో దొరికే ఖాలీ సమయంలో క్యారీ వ్యాన్‌లో కూర్చోకుండా అక్కడున్న పిల్లలతో సరదాగా గడిపింది సాయిపల్లవి. పిల్లలతో ఆమె సరదాగా కబుర్లు చెప్పడమే కాకుండా వారి చేతులను అందంగా మెహందీతో అలంకరించింది. ఆ పిల్లల ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సాయిపల్లవి 'హ్యాపీ క్లైంట్స్‌, పిప్రీ పిల్లాస్‌' అంటూ హార్ట్‌ ఎమోజీతో క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లే కాదు.. సమంత అక్కినేని, అనుపమ పరమేశ్వరన్‌, నీరజకోన వంటి సినీ సెలబ్రిటీలు కూడా సాయిపల్లవి కొత్త టాలెంట్‌ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సాయిపల్లవి.. రానాతో 'విరాటపర్వం', నాగచైతన్యతో 'లవ్‌స్టోరి' చిత్రాల్లో నటిస్తోంది. 



Advertisement
Advertisement