Abn logo
Sep 19 2020 @ 23:42PM

వృద్ధాశ్రమ నిర్మాణం పూర్తి చేశారు

Kaakateeya

గతేడాది అక్టోబర్‌ 15న తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ వృద్ధాశ్రమం నిర్మాణానికి, ఓ సంవత్సరం పాటు నిర్వహణకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హీరో సాయి తేజ్‌ మాటిచ్చారు. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా చాలామంది మెగా అభిమానులు తమ తమ ఊళ్లల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అనాథ శరణాలయాలకు పళ్లు, పుస్తకాలు, ఆహారం అందిస్తున్నారు. వాళ్లందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రతి సంవత్సరం తాత్కాలిక పరిష్కారం కింద అవన్నీ చేస్తున్నాం. ఏదైనా సమస్యకు శాశ్వత పరిష్కారం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ట్విట్టర్‌లో ఓ వృద్ధాశ్రమం వాళ్లు నిర్మాణానికి సహాయం చేయమని అడిగారు. అది పూర్తి చేస్తా’’ అని సాయి తేజ్‌ గతంలో ఓ వీడియో విడుదల చేశారు. అన్నట్టుగానే తన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన సహకారంతో వృద్ధాశ్రమ నిర్మాణం పూర్తయింది. సాయితేజ్‌ పిలుపు మేరకు ఈ సహాయ కార్యక్రమానికి అభిమానులు సుమారు లక్ష రూపాయల వరకూ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement