May 9 2021 @ 10:59AM

శ్యామ్ సింగరాయ్ నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్

శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి తాజాగా సాయి పల్లవి లుక్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. నేడు ( మే 9 ) సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి త్రిశూలం పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ లుక్‌ను గమనించినట్టైతే భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అమ్మవారి పండుగ సంబరాలు జరిగే నేపథ్యంలో తెరకెక్కించిన పాటలోనిదని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి మరొక హీరోయిన్‌గా కనిపించబోతుండగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.