Aug 1 2021 @ 17:09PM

Sai Pallavi: సాయిపల్లవికి మరో చాన్స్‌

‘ప్రేమమ్‌’ చిత్రం ద్వారా బిగ్‌స్క్రీన్‌కు పరిచయమైన తమిళ అమ్మాయి సాయిపల్లవిని కోలీవుడ్‌లో మరో చాన్సు వరించింది. వివ‌రాల్లోకెళ్తే సాయిప‌ల్ల‌వి ఇంత‌కు ముందు త‌మిళంలో ‘మారి-2’, ‘ఎన్‌జీకే’ అనే చిత్రాల్లో నటించింది. ఇవి సాయిపల్లవికి తీవ్ర నిరాశనే  మిగిల్చాయి. దీంతో  ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అయితే టాలీవుడ్‌లో సాయిపల్లవికి వరుస ఆఫర్లు రావడంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో వుండే సాయి పల్లవికి తాజాగా ఓ కోలీవుడ్‌ ఆఫర్‌ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అనేక హిట్‌ చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ తెరకెక్కించే ఈ చిత్రం లేడీ ఓరియంటెండ్‌  కథతో సాగనుంది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.