Abn logo
Jul 14 2020 @ 11:34AM

సాయిప‌ల్ల‌వి కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారా?

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సాయిప‌ల్ల‌వి. ఈ అమ్మడు ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్యతో క‌లిసి ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తోంది. 15 రోజుల షూటింగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ పార్ట్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేయాల‌ని శేఖ‌ర్ క‌మ్ముల ప్లాన్ చేశార‌ట‌. సాయిప‌ల్ల‌విని ఇందులో ఓ పాట‌కు కొరియోగ్ర‌ఫీని స‌మ‌కూర్చాల‌ని డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కోరిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే బేసిగ్గా మంచి డాన్స‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా దొరికిన‌ట్లే. 

Advertisement
Advertisement
Advertisement