Abn logo
May 27 2020 @ 04:35AM

ఈసారైనా.. నిండేనా?

మంచినీటి చెరువులకు సాగర్‌ నీరు విడుదల

వేసవిలో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి

నీటి దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజల విజ్ఞప్తి


దర్శి, మే 26 : వేసవిలో ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు విడుదల చేసిన సాగర్‌ జలాలు ఈసారైనా సక్రమంగా మంచినీటి చెరువులకు చేరుతా యా, లేదోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ సాగర్‌ జలాలను చేపల చెరువులకు వదులుతున్నా రు. మంచినీటి అవసరాల కోసం రెండో విడత ప్రభు త్వం 2 టీఎంసీల నీటిని విడుదల చేసింది. అందులో 1 టీఎంసీ నీటిని జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడికాలువకు 7086 క్యూసెక్కు ల నీరు విడుదల చేయగా, అంతేమొత్తం బుగ్గవాగు కు చేరుతోంది. అక్కడ్నుంచి 4503 క్యూసెక్కుల నీరు సాగర్‌ ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. ఆ నీ టిని గుంటూరు బ్రాంచ్‌ కాలువకు 700 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్‌ కాలువకు 636 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు(ప్రకాశం సరిహద్దు) 2047 క్యూసెక్కులు, దర్శి బ్రాంచ్‌ కాలువకు 1128, ప మిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 200, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 444 క్యూసెక్కుల నీరు పంపిణీ అవుతోంది.


జిల్లాలోని కాలువలకు నీటి పరిమాణం బుధవారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మం చినీటి అవసరాల కోసం విడుదల చేసిన నీరు దుర్వినియోగం కాకుండా తాగునీటి చెరువులకు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరవై రోజుల క్రితం జి ల్లాకు 5.5 టీఎంసీల నీరు 15 రోజులు పాటు విడుద ల చేశారు. ఆ నీటిలో కొంతభాగం దుర్వినియోగం కా వటం వల్ల మంచినీటి చెరువులు పూర్తిగా నిండలేదు. ఎండలు మండిపోతుండటం, పలు గ్రామాల్లో నీటి ఎ ద్దడి ఉండంతో భవిష్యత్‌ అవసరాలు దృష్టిలో పెట్టుకొ ని రాష్ట్ర ప్రభుత్వం 2 టీఎంసీల నీరు మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా కృష్ణా బోర్డు అంగీకరించి ఆ మేరకు 2 టీఎంసీల నీరు కేటాయించింది. ప్రస్తుతం కేటాయించిన నీరు జిల్లాకు చేరినందున ఈసారైనా మంచినీటి చెరువులకు సక్రమంగా నింపాలని ప్రజలు కోరుతున్నారు. దుర్వినియోగం కాకుండా ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement