Abn logo
Jul 15 2020 @ 10:33AM

కాంగ్రెస్‌లోనే ఉన్నా... బీజేపీలో చేరను: సచిన్ పైలట్

న్యూఢిల్లీ: బీజేపీలో చేరబోనని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. గత ఆరు నెలలుగా తాను జ్యోతిరాదిత్య సింధియాను కానీ బీజేపీ నేతలను కానీ కలవలేదన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. ఇండియా టుడే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న సచిన్ పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు. తనకు 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతుందని పైలట్ చెబుతున్నారు. పైలట్ చెప్పేది నిజమైతే గెహ్లాట్ సర్కారు మైనారిటీలో ఉన్నట్లేనని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement