Abn logo
Sep 27 2020 @ 04:55AM

ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండండి: రూరల్‌ ఎస్పీ

గుంటూరు, సెప్టెంబరు 26: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రూరల్‌ జిల్లా పరిధిలో అన్ని మతాలకు చెందిన దేవాలయాల కమిటీ ప్రతినిధులు తక్షణం అప్రమత్తం కావాలన్నారు. ఇప్పటికే రూరల్‌ జిల్లా పరిధిలో ఉన్న దేవాలయాల కమిటీలకు నోటీసులు ఇచ్చామన్నారు. అంతేగాక రాత్రి పూట గస్తీని ముమ్మరం చేశామన్నారు. గస్తీ సమయంలో ఎస్‌ఐలు, సీఐలు, సిబ్బంది సంబంధిత ఆలయాలను కూడా సందర్శించి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.   ఆలయాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, రాత్రివేళ పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

Advertisement
Advertisement
Advertisement