Abn logo
Sep 17 2021 @ 00:25AM

రెండో విడత రుణమాఫీ పాట్లు..!

ఫింగర్‌ ప్రింట్‌ కోసం సర్వర్‌ పనిచేయకపోవటంతో అవస్థలు పడుతున్న డాక్రా మహిళలు

బయోమెట్రిక్‌ అథంటికేషన్‌కు సర్వర్‌ సమస్య

జిల్లాలో 7,833 సంఘాలు.. 74,172 మంది సభ్యులు

నేటితో ముగియనున్న గడువు 

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 16: ప ట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలకు ప్రభు త్వం అందజేయనున్న రెండో విడత రుణ మాఫీకి ఆధార్‌ బయోమెట్రిక్‌ అథంటికేషన్‌కు సర్వర్‌ కష్టాలు ఎదురయ్యాయి. దీంతో పొదుపు సంఘాల సభ్యులు బయోమెట్రిక్‌ కోసం బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ఈనెల 25న పొదుపు మహిళల వ్యక్తిగత ఖాతాలలో రుణమాఫీ సొమ్ము వేయనుం డగా, అందుకోసం ఆధార్‌ బయోమెట్రిక్‌ విధానం తప్పనిసరిగా పేర్కొంది. 2019, ఏప్రిల్‌1 నాటికి ఏ పొదుపు సంఘానికి ఎంత అప్పు ఉందో దానిని నాలుగు విడతలుగా ప్రభుత్వం మాఫీ డబ్బులు వేయనుంది. గతేడాదిమొదటి విడత వేయగా, ఈ నెలలో రెండో విడత రుణమాఫీ సొమ్ములు ఖాతాలలో వేసేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం గ్రూపు సభ్యులు తమ వివరాలను ఆన్‌లైన్‌ బయోమెట్రిక్‌ అథంటికేషన్‌కు గడువు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. గురు, శుక్రవారాల్లో సభ్యులు తమ వేలిముద్రలు వేసి అనుసంధానం చేయించు కోవా లని సూచించారు. దీంతో పొదుపు మహిళలకు కష్టాలు మొదలయ్యాయి. 

జిల్లాలోని 7,833 పొదుపు సంఘాలకుగాను 74,172 మంది సభ్యులు తమ వివరాలను ఆధార్‌ బ యోమెట్రిక్‌ ద్వారా నమోదు చేయించుకోవాల్సి ఉంది. ఒకవైపు సర్వర్‌ సమస్య వేధిస్తుండగా, మ రోవైపు గడువు నేటితో ముగియనుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మరో ఐదు రోజులు అవకాశం కల్పిస్తే జిల్లాలోని నూరు శాతం మంది సభ్యులు తమ వివరాలు నమోదు చే సుకునే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వం అందించే రుణమాఫీ అవకాశం కోల్పోతామనే ఆందోళన పొదుపు మహిళలో కని