గత ప్రభుత్వంలో ఒప్పందం ప్రకారం చెల్లింపులు
విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్సఆర్టీసీలో రివైజ్డ్ పే స్కేల్క్-2017 వర్తింపు పీరియడ్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు దశల వారీగా ఆమేరకు ప్రయోజనాన్ని కల్పించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోని ఐదు వేలమంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2017 ఏప్రిల్ 30 నుంచి 2019 ఫిబ్రవరి 2 పీరియడ్‌లో 25 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.
క్రిస్మస్, సంక్రాంతి అడ్వాన్సులు ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ అడ్వాన్స్‌లు చెల్లించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సోమవారం యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ, పీటీడీ కమిషనర్ క్రిష్ణబాబును యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కలిసి విన్నవించారు.