Abn logo
Sep 20 2021 @ 23:20PM

రూ.80,100 పలికి గణేష్‌ లడ్డూ

నిమజ్జనానికి బయలు దేరిన వినాయక విగ్రహం

జలుమూరు: శ్రీముఖలింగం వెలమ వీధిలో కొలువుదీరిన గణేశుని 116 కేజీల లడ్డూ ప్రసాదాన్ని గ్రామస్థుడు సీపాన వేణు రూ.80,100 లకు వేలంలో దక్కించుకున్నాడు. సోమవారం గణేశునికి ప్రత్యేక పూజల అనంతరం విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించి వంశధార నదిలో నిమజ్జనం చేశారు.


దీర్ఘాసిలో గణపతి నిమజ్జనం

దీర్ఘాసి(పోలాకి) : దీర్ఘాసి మెండవీధిలో గణేష్‌ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని నవరాత్రి ఉత్సవం సోమవారం ముగిసింది. యువకులు, మహిళలు ఉదయం పురోహితుడు ఆరవిల్లి కృష్ణశర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి గణేష్‌ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మెండ కృష్ణ సుమంగళి, ఎంపీటీసీ సభ్యురాలు పాగోటి అనూ రాధ తదితరులు పాల్గొన్నారు.