Abn logo
Sep 24 2021 @ 21:28PM

ఒక్క రోజులో రూ. 575 కోట్ల అమ్మకాలు...

హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు తమ లాభాలను కొనసాగిస్తున్నాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ రియాల్టీ ఇండెక్స్ 25 శాతం పెరగడంతో పండుగ సీజన్‌కు ముందే  డిమాండ్ ఏర్పడింది. వ్యక్తిగత స్టాక్‌ల విషయానికి వస్తే డీఎల్‌ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియాల్టీ 30-41 శాతం మధ్య ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో శుక్రవారం నాటి ఇంట్రా-డే ట్రేడ్‌లో ఇండెక్స్ తాజా 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 4,067.71 ని తాకింది.


వ్యక్తిగతంగా డీఎల్ఎఫ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంట్రా-డే డీల్స్‌లో రూ.1 ట్రిలియన్ మార్కును దాటింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్, అతిపెద్ద ల్యాండ్ ఓనర్స్‌లో ఒకరైన సెంచరీ రియల్ ఎస్టేట్ గురువారం ప్రకటించిన డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ సెంచరీ సీజన్స్‌లో 75 శాతానికి పైగా ఇన్వెంటరీలు కేవలం ఒక్క త్రైమాసికంలోనే విక్రయించబడ్డాయి.  గోద్రేజ్ ప్రాపర్టీస్ నోయిడాలో తన ప్రాజెక్ట్ గోద్రేజ్ వుడ్స్ రెండవ దశ ప్రారంభోత్సవంలో కేవలం ఒకే రోజులో రూ. 575 కోట్ల అమ్మకాలను సాధించినట్లు తెలిపింది. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రీన్ గడిచిన 6 నెలల్లో ప్రాజెక్ట్‌లో మొత్తం అమ్మకాలను తీసుకుంటే.. దాదాపు రూ.1, 140 కోట్లను రాబట్టి ఊహించని రీతిలో విపరీతంగా కస్టమర్‌లను ఆకర్షించగలిగింది. అత్యంత ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్‌లలో ఒబెరాయ్ రియల్టీ ఒకటి. రెరా, డీమోనిటైజేషన్ తర్వాత పరిశ్రమలో ఇటీవలి కన్సాలిడేషన్ నుంచి కంపెనీ లాభపడింది. తక్కువ రుణ రేట్లు, స్టాంప్ డ్యూటీ కోతలు, బ్రాండ్‌లకు వినియోగదారుల ప్రాధాన్యత, రెడీ-టు-మూవ్-ఇన్ ప్రాపర్టీస్ ఒబెరాయ్ రియల్టీకి బాగా ఉపయోగపడతాయి. 

ఇవి కూడా చదవండిImage Caption