Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాంకుల నుంచి ఏపీకి రూ.57,479 కోట్ల అప్పు

అమరావతి: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి భారీగా రుణం లభించింది. 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పును  ఏపీ ప్రభుత్వం చేసింది. ఏపీలో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలను మంజూరు చేశాయి.  అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రంస్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ఈ వివరాలను వెల్లడించారు.2019 నుంచి 2021 నవంబర్ వరకు రుణాలను బ్యాంకులు మంజూరీ చేశాయి. అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి రూ.11,937 కోట్లు రుణాన్ని 9 సంస్థలు పొందాయి. బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి.


బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలకు రూ.7 వేల కోట్ల రుణం లభించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ. 750 కోట్ల అప్పును సంస్థలు తీసుకున్నాయి. ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ. 1,750కోట్ల రుణం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. 


Advertisement
Advertisement