Abn logo
Aug 3 2021 @ 22:10PM

బెల్టుషాపు నిర్వాహకుడికి రూ. 20 వేలు జరిమానా

తహసీల్దారు ఎదుట బైండోవర్‌ అయిన మద్యం బెల్టుషాపు నిర్వాహకుడు

సంగం, ఆగస్టు 3: సెబ్‌ అధికారులు బైండోవర్‌ చేసిన బెల్టుషాపు నిర్వాహకుడికి  తహసీల్దారు లక్ష్మీ ప్రసన్న మంగళవారం రూ. 20 వేల జరిమానా విధించారు. చెన్నవరప్పాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం బెల్టుషాపు నిర్వహిస్తుండడంతో  సెబ్‌ అధికారులు  పట్టుకుని తహసీల్దారుకు బైండోవర్‌ చేశారు.  గతంలోనూ ఆ వ్యక్తిని ఇదే కేసులో బైండోవర్‌ చేశారు. సంగం గ్రామానికి చెందిన పాపిరెడ్డి కూడా మద్యం బెల్టుషాపు నిర్వహిస్తుండగంతో అదుపులోకి తీసుకుని తహసీల్దారు ఎదుట బైండోవర్‌ చేశారు.