Abn logo
May 20 2020 @ 04:34AM

పాలమూరు మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.17 కోట్లు

జీఓ విడుదల చేసినట్లు వెల్లడించిన మంత్రి


మహబూబ్‌నగర్‌, మే 19 : పాలమూరు మునిసిపాలిటీలో అభివృద్ధి ప నుల కోసం ప్రభుత్వం రూ.17 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చే సిందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ వెంక ట్రావుతో కలిసి మునిసిపల్‌ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పెద్దచెరువు కింద చేపడుతున్న శిల్పారామం కోసం రూ.8కోట్లు, అక్కడే గ్రీ నరీ ఏర్పాటు కోసం రూ.4కోట్లు, అప్పన్నపల్లి నుంచి వన్‌టౌన్‌ చౌరస్తా వ రకు సెంట్రల్‌ డివైడర్‌, లైటింగ్‌ కోసం రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.


దీనికి సంబంధించి ఈనెల 13న జీఓ జారీ అయిందన్నా రు. పెద్దచెరువుపై పచ్చదనం పెంపొందిస్తే పర్యాటక ప్రాంతంగా మారు తుందన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామ న్నారు. ప్రధాన రోడ్డు విస్తరణ తర్వాత పాలమూరు రూపురేఖలు మారి పోతాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కొరమోని నర్సింహు లు, కమిషనర్‌ వడ్డె సురేందర్‌, ఎంఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement