తిరుమల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్(ఎస్వీబీసీ) ట్రస్టుకు ఆదివారం రూ.1.11 కోట్ల విరాళం అందింది. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన డీఆర్ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో దినేష్ నాయక్ ఈ విరాళాన్ని డీడీ రూపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కాగా, ఇదే సంస్థ గతనెల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందజేసినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.