Abn logo
Oct 9 2020 @ 02:48AM

దశల వారీగా పట్టా పాసుపుస్తకాల అందజేత

Kaakateeya

శామీర్‌పేట రూరల్‌: పట్టాపాస్‌ పుస్తకాలను రైతులకు దశల వారీగా అందజేస్తామని ఎంసీపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్‌ సురేందర్‌ అన్నారు. గురువారం ఎంసీపల్లి మండలం లక్ష్మాపూర్‌ రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మాపూర్‌ గ్రామంలో రైతులకు గతంలో కొంతమేర పట్టాపాస్‌ పుస్తకాలను అందించారని మరికొన్ని పాస్‌పుస్తకాలను ప్రస్తుతం రైతులకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు.


రైతులు తమ భూవివరాలు సరిచూసుకోవాలని ఒకవేళ తప్పులు దొర్లితే సరిచేస్తామని చెప్పారు. పాస్‌ పుస్తకాలు రానివారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, ఉపసర్పంచ్‌ వైద్యనాథ్‌, నాయకులు సత్తయ్య, బస్వారెడ్డి, జగన్నాధం, కీసరి నర్సింలు, హీరాలాల్‌, సత్యనారాయణ, చిత్తయ్యగౌడ్‌, లక్ష్మణ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement