Abn logo
Oct 9 2020 @ 02:44AM

వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ

Kaakateeya

శామీర్‌పేట రూరల్‌: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వృద్ధ మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరికి గురైన సంఘటన శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన దేశమైన పోచమ్మ, కిష్టయ్య భార్యాభర్తలు. వీరు బుధవారం రాత్రి అద్రా్‌సపల్లిలోని తన కూతురు జ్యోతి ఇంటికి వెల్లి గురువారం ఉదయం ప్రాంతంలో శామీర్‌పేటకు తిరుగు పయనమయ్యారు.


ఈ క్రమంలో బాబాగూడ, శామీర్‌పేట గ్రామాల మధ్య ఎవర్‌గ్రీన్‌ పాఠశాల సమీపంలో సుమారు 8.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెనకాలే వస్తూ వీరు వెళ్తున్న ఎక్సెల్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసి పోచమ్మ మెడలో ఉన్న 3.5 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కోని పారిపోయారు. ఈ క్రమంలో భార్య, భర్తలు ఎక్సల్‌పై నుంచి కిందపడిపోయారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. వెంటనే తేరుకుని తమ కుటుంబీకులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంతోషం తెలిపారు. 

Advertisement
Advertisement