Abn logo
Oct 9 2020 @ 02:32AM

కొనసాగుతున్న కరోనా ఉధృతి

Kaakateeya

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో గురువారం 882 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిజిల్లాలో 402 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లాలో 394, వికారాబాద్‌జిల్లాలో 26కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో 85,863 మంది కరోనా బారిన పడ్డారు. 


ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్‌లో.. 

ఇబ్రహీంపట్నం / కందుకూరు / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 306మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 31 మందికి పాజిటివ్‌ వచ్చింది. సీహెచ్‌సీ ఇబ్రహీంపట్నంలో 3,  అబ్దుల్లాపూర్‌మెట్‌లో 4, ఎలిమినేడులో 2, యాచారంలో 2, దండుమైలారం 3, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 7, తట్టిఅన్నారంలో 7, రాగన్నగూడలో ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో అగర్‌మియాగూడ, కొత్తూరు, కందుకూరు గ్రామాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 45 మందికి కరోనా పరీక్షలు చేయగా నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


చేవెళ్ల డివిజన్‌లో...

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 202మందికి కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే ఆలూర్‌ ప్రాథమిక ఆసుపత్రిలో 51 మందికి పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మందికి పరీక్షలు చేయగా 4, శంకర్‌పల్లి మండలంలో 43మందికి  పరీక్షలు చేయగా 3, మొయినాబాద్‌ మండ లంలో 52 మందికి పరీక్షలు చేయగా 2, షాబాద్‌ మండ లంలో 26మందికి  పరీక్షలు చేయగా ఇందులోఎవరికీ పాజిటివ్‌ రాలేదు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో...

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 257మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన 8మంది, కొత్తూర్‌ మండలానికి చెందిన ఆరుగురు, కొందుర్గు మండలానికి చెందిన ఐదుగురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ముగ్గురు ఉన్నారు. 


కులకచర్లలో..

కులకచర్ల: కులకచర్ల మం డల పరిధిలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 17మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈర్లవాగు తండాలో ఒకరికి, చిన్న అంతారంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు.


బ్యాంకు ఉద్యోగికి కరోనా

ధారూరు: ధారూరు స్టేట్‌ బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగి(30)కి కరోనా సోకినట్లు ధారూరు ప్రాథమిక వైద్యాధికారి రాజు తెలిపారు. గురువారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. 

 

మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ / కీసర : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 73 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 27మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 69మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement