Abn logo
Oct 8 2020 @ 05:32AM

కరోనాతో ఇద్దరి మృతి

Kaakateeya


ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 882 కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి జిల్లాలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. 15రోజులుగా వరుసగా రోజుకూ కరోనాతో ఒకరిద్దరు మృతి చెందు తున్నారు. బుధవారం వైరస్‌ కాటుకు మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 272కు చేరుకుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం 882 కరోనా కేసులు నమోదయ్యాయి.


ఇందులో రంగారెడ్డి జిల్లాలో 512, మేడ్చల్‌ జిల్లాలో 343, వికారాబాద్‌ జిల్లాలో 27కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 85,863కు చేరుకుంది. 



ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లో.. 

ఇబ్రహీంపట్నం/ శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 382మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 51 మందికి పాజిటివ్‌ వచ్చింది. సీహెచ్‌సీ ఇబ్రహీంపట్నంలో 9,  అబ్దుల్లాపూర్‌మెట్‌లో 13, ఎలిమినేడులో 6, యాచారంలో 2, దండుమైలారం 1, ఆరుట్లలో  1, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 5, తట్టిఅన్నారంలో 2, రాగన్నగూడలో 12 మందికి పాజిటివ్‌ అని తేలింది. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 50 మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 217 మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజి టివ్‌గా తేలింది. ఇందులో ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఇద్దరు, కొందుర్గు మండలానికి చెందిన నలు గురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ఇద్దరు ఉండగా... షాద్‌నగర్‌ పట్టణం, నందిగామ, కేశంపేట మండలాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.


వృద్ధురాలి మృతి

చౌదర్‌గూడ : మండలంలోని చేగిరెడ్డి ఘనాపూర్‌కు చెందిన 80ఏళ్ల వృద్ధురాలు కరోనా బారిన పడి బుధవారం మృతిచెందింది. ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కొందుర్గు పీహెచ్‌సీలో పరీక్ష చేయించడంతో పాజిటివ్‌ వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వృద్ధురాలు కోలుకోలేక మృతిచెందింది.


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 168మందికి కరోనా పరీక్షలు చేయగా 13మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 28మందికి పరీక్షలు చేయగా 6, శంకర్‌పల్లి మం డలంలో 42మందికి పరీక్షలు చేయగా 3, మొయినాబాద్‌ మండ లంలో 49మందికి పరీక్షలు చేయగా 2, షాబాద్‌ మండలంలో 41మందికి  పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరుగుతోంది. బుధవారం వికారాబాద్‌లో 15 కేసులు, తాండూరులో 3, పరిగిలో 3, ధారూరు, దోమ, యాలాల్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో సుధాకర్‌ సింధే తెలిపారు.


కులకచర్లలో..

కులకచర్ల : కులకచర్ల ఆసుపత్రిలో 30మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. గండీడ్‌ మండలం నంచర్లలో భార్యభర్తలకు, దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ / కీసర : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో 48 మందికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. కీసరలో 50మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 13 మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Advertisement
Advertisement