Katrina Kaif పెళ్లిలోని సెక్యూరిటీ గార్డుల కోసం గదులు బుక్ చేసిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. బీ టౌన్‌లో మొత్తం వీరి వివాహం గురించే చర్చించుకుంటున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో డిసెంబర్ 9న వీరి పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. సంగీత్, మెహందీ సంబరాలు డిసెంబర్ 7, 8తేదీల్లో జరగనున్నాయి. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇద్దరూ కూడా ఈ పెళ్లిపై ఇంత వరకు స్పందించలేదు. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అతిరథ మహారథులతో పాటు పీఏమ్‌వో అధికారులు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది.


సెలెబ్రిటీ కపుల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్‌ల కోసం అనేక గదులను బుక్ చేశారని తెలుస్తోంది. మాత ట్రస్ట్ ధర్మశాల మేనేజర్ రామ్ అవతార్ గుర్జర్ ఈ విషయాలను మీడియాకు తెలిపారు. ‘‘ముంబైకి చెందిన ఒక ఈవెంట్ మెనేజ్‌మెంట్ కంపెనీ 150మంది సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్‌ల కోసం 5హాళ్లు, 27గదులను బుక్ చేసింది. డిసెంబర్ 4 నుంచి 10 వరకు ఈ గదులు బుక్ అయి ఉన్నాయి. వీటితో పాటుగా మీనా ధర్మశాలలో 30గదులు, 5 పెద్ద హాళ్లను కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బుక్ చేసింది’’ అని ఆయన వెల్లడించారు.


తమ పెళ్లి సంబరాలకు విచ్చేసేవారు సెల్‌ఫోన్‌లను తీసుకురావొద్దని ఈ జంట చెబుతున్నారు. ఈ పెళ్లికి అతిథులుగా దాదాపుగా 120మంది వరకు రాబోతున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...