Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీలో వెన్నుపోటు నాయకులు: రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి: వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే  రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు. మంత్రి పెద్దరెడ్డిని ఉద్దేశించే రోజా ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కొంతమంది నాయకులు తమ అనుచరులను వైసీపీ రెబెల్స్‌గా పోటీకి నిలబెట్టి పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. రెబెల్స్‌ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని ఆమె పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె అన్నారు. 


Advertisement
Advertisement