Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారు: రోజా

అమరావతి: కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబుకు పిచ్చి పెట్టినట్టు అనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఏరియల్ సర్వేపై చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. ప్రకృతి పరంగా వచ్చిన భారీ వర్షాలు మానవ తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా..? అని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Advertisement
Advertisement