తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుంతను పూడ్చుతున్న కూలీలు
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ఒంగోలు(క్రైం), డిసెంబరు 4: ఒంగోలు నగరంలో రోడ్ల మరమ్మతు లకు కార్పొరేషన్ అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గోతులు... గగ్గోలు అనే శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచరితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రధానంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రమాకరంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించారు. ఇంకా నగరంలో అనేక చోట్ల అధ్వానంగా ఉన్న రోడ్లను పునరుద్ధరించాల ని వాహనదారులు కోరుతున్నారు.