Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతిలో ‘రోబో’ రెస్టారెంట్‌

తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 8: తిరుపతిలోని ‘రోబో’ రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని ఈ రెస్టారెంట్‌ను బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. నగరవాసులకు ఇదొక గొప్ప అనుభూతి కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో రెస్టారెంట్‌, స్వీట్‌స్టాల్‌, కాఫీషాప్‌, ఫంక్షన్‌ హాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోబో డైనర్‌ అధినేత భరత్‌రెడ్డిని మంత్రి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ద్వారకనాథరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రోజా, సంజీవయ్య, మేయర్‌ డాక్టర్‌ శిరీష, జిల్లా ఉన్నతాధికారులు రోబో రెస్టారెంట్‌ను సందర్శించి అద్భుతంగా ఉందని కొనియాడారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలు ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి కస్టమర్లను పలకరించి ఆర్డర్‌ తీసుకుని, సర్వింగ్‌ చేయడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత అని భరత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం దాదాపు రూ.4 కోట్లతో పది రోబోలు కొన్నామన్నారు. అదనంగా 500 మందితో శుభకార్యాలు జరుపుకునేలా ఫంక్షన్‌ హాలు రూపొందించామని ఆయన వివరించారు. 

Advertisement
Advertisement