Abn logo
Oct 16 2021 @ 06:50AM

అత్తగారి చికిత్స కోసం ముంబై వెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చాక ఇంటి పరిస్థితి చూసి షాక్

జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌కు శంషేర్ అనే వ్యక్తి తన అత్తగారి చికిత్స కోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. సెప్టెంబర్ 20న తన పొరుగింటి వారికి తాను అత్తగారి చికిత్స కోసం కుటుంబంతో సహా ముంబై వెళుతున్నానని చెప్పి శంషేర్ ఇంటి తాళాలు ఇచ్చి వెళ్లిపోయాడు.  


నాలుగు రోజుల తరువాత ముంబై నుంచి శంషేర్ తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగివచ్చాడు. ఇంటి పరిస్థితి చూసి అతను షాక్‌కు గురైయ్యాడు. ఇల్లంతా అతలాకుతలమైంది. ఇంట్లో వస్తువలన్నీ కింద పడేసున్నాయి. శంషేర్‌కు అనుమానం వచ్చి ఇంట్లోని విలువైన వస్తువలు జాగ్రత్తగా ఉన్నాయో? లేవో? అని వెతికాడు. ఇంట్లోని 7 లక్షల విలువైన నగలు, 50 వేల రూపాయల నగదు మాయమయ్యాయి. డబ్బులు, నగలతో పాటు ఇంట్లోని ఖరీదైన బట్టలు కనిపించడంలేదు.


శంషేర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంటిని పరిశీలించారు. దొంగలెవరో శంషేర్ ముంబై వెళుతున్నట్లు తెలిసుకున్నారని చెప్పారు. దొంగలు ఇంటి ముందు ద్వారం నుంచి వచ్చారని, కానీ దొంగతనం చేసి వెనుక ద్వారం నుంచి పారిపోయారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై దొంగతనం కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...