Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డెక్కిన విద్యార్థులు

పస్తులతో ‘కస్తూర్బా’ విద్యార్థినుల ధర్నా 

ఆరు గంటల నిరసనతో స్పృహ కోల్పోయిన ఇద్దరు బాలికలు

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆందోళన 

సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని నిరసన 

ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల విద్యార్థుల ఆందోళన 

  మద్దిరాల, డిసెంబరు 2: మౌలిక వసతులు కల్పించాలని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఆరు గంటలపాటు నిరసన వ్యక్తంచేశారు. రాత్రి భోజనం, ఉదయం అల్పాహా రం తీసుకోకుండా ఆందోళనకు దిగటంతో ఇద్దరు విద్యార్థినులు స్పృహ కో ల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మద్దిరాల మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో కస్తూర్బా గాంధీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తుండగా 10వ తరగతి లోపు 160 మంది, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 20 మంది ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలు, ఇద్దరు నానటీచింగ్‌ స్టాఫ్‌ పాఠశాలలో ప్రతిరోజూ అందుబాటులో ఉంటారు. బుధవారం రాత్రి పాఠశాలలోని వంటగదిలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనతో పాఠశాలలో ఉన్న 100 మంది విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది గ్యాస్‌ లీకేజీని అరికట్టి సమస్య పరిష్కరించారు. అయితే ఆ భ యంతో 50మంది విద్యార్థినులు రాత్రి భోజనం చేయలేదు. జరిగిన విషయాన్ని విద్యార్థినులు ప్రత్యేక అధికారి(ఎ్‌సవో) తేజశ్రీకి సమాచారమిచ్చా రు. సూర్యాపేటలో ఉంటున్న ఆమె ఉదయమే వస్తానని, భయపడవద్దని, కాసేపు టీవీ చూడమని విద్యార్థినులకు చెప్పారు. గురువారం ఉదయం ఆ మె పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థినులు ఉదయం ఏడు గంటల నుం చి 10గంటల వరకు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. భవనం శిథిలావస్థకు చేరి వర్షం వచ్చినప్పుడల్లా కురుస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, విద్యుత సరఫరా, సరైన మంచినీటి సౌకర్యం లేదని, తమకు మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ప్రత్యేక అధికారి రాకపోవడంతో మండల కేంద్రంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లిన విద్యార్థులు అక్కడ నిరసన కొనసాగించారు. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం తినకుండా మధ్యాహ్నం 12 గంటలవరకు విద్యార్థినులు ఆందోళన చేయడంతో ఇద్దరు స్పృహ కోల్పోయారు. విషయం తెలుసుకున్న జీసీడీవో రమణ, తహసీల్దార్‌ మన్నన, పోలీస్‌ సి బ్బంది అక్కడికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. స్పృహకోల్పోయిన విద్యార్థినులను పాఠశాలకు తీసుకువెళ్లి ఆరోగ్యం కుదుటపడేలా చర్యలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించి, పాఠశాల వద్దకు వెళ్లారు. ఆర్డీవో రాజేంద్రకుమార్‌ పాఠశాలకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భో జనం చేసి తరగతులకు వెళ్లారు.

ధర్నా చేస్తే సమస్యలు తీరతాయా?

మౌలిక వసతులు కల్పించాలని ఆందోళన చేసిన విద్యార్థినులపై డీఈ వో అశోక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన ముగించుకుని పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలు ఉంటే తమ దృ ష్టికి తేవాలి కానీ, ఆందోళన చేయడమేంటని హెచ్చరించారు. ధర్నాలు చే స్తే సమస్యలు తీరతాయా అన్నారు. కనీసం మెనూ పాటించడం లేదని, సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ఆందోళన చేయాల్సి వచ్చిందని విద్యార్థినులు పేర్కొన్నారు. 

ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలి

తుర్కపల్లి, ఆలేరు యాదగిరిగుట్ట రూరల్‌: ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించడంతో పాటు సకాలంలో నడపాలని విద్యార్థులు కోరారు. మండలంలోని మాదాపూర్‌ బస్టాండ్‌ చౌరస్తాలో చిన్నలక్ష్మాపూర్‌, మాదాపూర్‌, ధర్మారం గ్రామాలకు చెందిన విద్యార్థులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. చిన్న లక్ష్మాపూర్‌, పొట్టిమర్రి తండాల నుంచి బస్సు సౌకర్యం లేనందున మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదాపూర్‌కు నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోయారు. దీం తో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాంటే ప్రతీ రోజు ఆలస్యమవుతోందని, విద్యాసంస్థలు ముగిసిన పిదప ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతోందని వి ద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నాను విరమించేదిలేదని విద్యార్థులు భీష్మించారు. ధర్నాతో గంటకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులను పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారని  పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.  

   యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో పరిధిలోని విద్యార్థులు కళాశాల, పాఠశాలలకు వేళ్లేందుకు సమయానుకూలంగా గతంలో నడిపించే బస్సులను పునరుద్ధరించాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆర్టీసీ డీఎం లక్ష్మారెడ్డిని ఆదేశించారు. గురువారం తన నివాసంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మారెడ్డి, సూపర్‌ వైజర్‌ ఎల్లయ్యలతో సమస్యపై సమీక్షించారు. ఆలేరు నియోజకవర్గం కొన్ని గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదని త మ దృష్టికి వచ్చిందని, ఆ గ్రామాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన గ్యాదపాక నాగరాజు, మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్య, మల్లేశ, గంగుల శ్రీనివాస్‌, పుట్ట మల్లేశ, ఆంజనేయులు, రాములు, రవి, ఫ యాజ్‌, రమణారెడ్డి, శ్రీనివాస్‌, శ్రావణ్‌, వెంకటయ్య, శ్రీధర్‌గౌడ్‌, ఎంపీపీ భూక్య సుశీల తదితరులు పాల్గొన్నారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి

భువనగిరిటౌన: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో తరగతులను బహిష్కరించి ప ట్టణ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు, యువ త బలిదానంతో సిద్ధించిన తెలంగాణలో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌ వైన్సపై చూ పుతున్న శ్రద్ధను విద్యార్థుల భవిష్యత్తుపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ, దీ పిక, సాయి, రవికుమార్‌, హరీష్‌, ఉమేష్‌, శ్రీవిద్య పాల్గొన్నారు. 


Advertisement
Advertisement