Abn logo
Sep 25 2021 @ 02:23AM

ఒకవైపే రోడ్డు.. మరోవైపు రోత

వంతెనకు ఒకవైపు అధ్వానంగా ఉన్న రహదారి

నగరంలో అయ్యప్పగుడి సెంటర్‌ సమీపంలోని ఫ్లైవోవర్‌ వంతెన పక్కన రహదారి అధ్వానంగా ఉంది. రైల్వే ట్రాక్‌ దాటిన తర్వాత కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి వెళ్లే మార్గంలో వంతెనకు ఒకవైపే రహదారి నిర్మించారు. రెండో వైపు రోడ్డు అసంపూర్తిగా గుంతలతో నిండి ఉంది. భూగర్భడ్రైనేజీ పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపిన తర్వాత రోడ్డును పునర్నిర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అసౌక ర్యం కలుగుతోంది. వర్షాకాలం గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు.

ఫొటోలు : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌


వంతెనకు మరోవైపు సౌకర్యవంతంగా రోడ్డు