Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 5 2021 @ 08:27AM

బైక్‌ను ఢీకొన్న Car

              - ఇద్దరు మెడికోలు సహా ముగ్గురి దుర్మరణం


పెరంబూర్‌(చెన్నై): తిరునల్వేలి సమీపంలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదం ఇద్దరు వైద్య విద్యార్థిను లు సహా ముగ్గురిని బలిగొంది. వివరాలిలా వున్నాయి... నాగర్‌కోయిల్‌ నుంచి తూత్తుకుడి వైపుకు వెళ్తున్న కారు టైర్‌ హఠాత్తుగా పేలడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొంటూ అదే వేగంతో ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మోటార్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్య విద్యార్థినులు అల్లంతదూరాన ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో సంవత్సరం చదువుతున్న గాయత్రి, బ్రిట్టో ఏంజల్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. అలాగే, కారు నడుపుతున్న షణ్ముగసుందరం తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థినిని తిరునల్వేలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరునల్వేలి నగర పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement