Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు ప్రమాదంలో నూతన వరుడు మృతి

పెళ్లైన 24 గంటల్లోనే విషాదం

 తమిళనాడులో  ప్రమాదం

హైదరాబాద్/చందానగర్‌: రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతిచెందాడు. పెళ్లైన 24 గంటల్లోనే ఈ ఘటన జరగడంతో శేరిలింగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి నేతాజీనగర్‌లో నివాసముంటున్న అన్నపూర్ణ, మురళీకృష్ణ దంపతుల కుమారుడు శ్రీనివాసులు (36) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నైకి చెందిన దేవకి, సుబ్రమణ్యం కుమార్తె కనిమొళితో తిరుపతిలోని కొలాయిగుంటలో ఆదివారం 21న వివాహం జరిగింది. చెన్నైలో ఉండే అత్తమామల ఇంటికి శ్రీనివాసులు స్వయంగా కారు నడుపుతూ సోమవారం వెళ్తుండగా తమిళనాడులోని కృష్ణగిరి ఆస్పత్రి ఎదుట ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా, కనిమెళి సృహ కోల్పోగా ఆస్పత్రికి తరలించారు. బుధవారం శేరిలింగంపల్లికి చేరుకున్న శ్రీనివాసులు మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement
Advertisement