Abn logo
Oct 30 2020 @ 09:48AM

తూ.గో.జిల్లాలో రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Kaakateeya

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతులు గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement