Abn logo
Oct 30 2020 @ 09:33AM

తంటికొండ రోడ్డు ప్రమాదం దురదృష్టకరం: అచ్చెన్నాయుడు

Kaakateeya

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో ఏడుగురు మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలంటూ.. అచ్చెన్నాయుడు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతులు గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement